ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ లో పర్యటిస్తున్నారు. సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. నేటి నుండి 5 రోజుల పాటు సీఎం సింగపూర్ లో పర్యటించనున్నారు. అక్కడ సీఎంకు స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీఎన్ఆర్టీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి తాను బసచేసే హోటల్ కు చేరుకున్న సీఎం, మంత్రుల బృందానికి స్థానిక తెలుగు కుటుంబాలకుచెందిన వారు స్వాగతం పలికారు. సీఎంకు స్వాగతం పలికేందుకు సంప్రదాయ వస్త్రధారణలో తెలుగు కుటుంబాలకు చెందిన మహిళలు తరలి వచ్చారు. హారతులు పట్టారు. చిన్నారులు కూచిపూడి నృత్యాలతో స్వాగతించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆయన బస చేస్తున్న హోటల్ ప్రాంగణంలో తెలుగు కుటుంబాల సందడి నెలకొంది. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ, టీజీ భరత్ లు హాజరు కానున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు