ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేసి… ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది కాలంలో ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను వివరించి…. రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాలపై వారితో చర్చించి నేడు నిర్ణయాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఆదివాసీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు, నిరాడంబరతకు నిలువుటద్దంగా నిలిచే జీవనశైలి ఆదివాసుల సొంతం. కూటమి ప్రభుత్వంలో ఆదివాసీల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం నిత్యం కృషిచేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,557 కోట్ల నిధులను వారి సంక్షేమం కోసం వెచ్చించడం జరిగింది. భవిష్యత్ లోనూ గిరిజనులకు అన్నివిధాలా అండగా నిలుస్తామని లోకేష్ అన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు