దేశవ్యాప్తంగా ప్రజలు ఈరోజు రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన రాఖీ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ, సోదర సోదరీమణుల మధ్య ఉండే విడదీయరాని ప్రేమ, విశ్వాసం, రక్షణ అనే బంధానికి అంకితమైన పవిత్రమైన పండుగ ‘రక్షాబంధన్’ సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ తదితరులు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు… శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు
By admin1 Min Read