79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు:
దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ దేశాలలో అన్ని విధాలా బలమైన శక్తిగా భారతదేశం ఎదుగుతున్న తరుణం ఇది. ఇటువంటి సమయంలో దేశ సమగ్రతకు, భద్రతకు, ప్రగతికి సమైక్యంగా కృషి చేసేందుకు ఈ సందర్భంగా సంకల్పిద్దాం.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ :
దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందరో మహనీయుల త్యాగాల పునాదులపై నిర్మితమైన స్వతంత్ర ప్రజాస్వామ్య సౌధం మన దేశం. మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది అంటే ఆ త్యాగధనుల ఆత్మార్పణల ఫలితమే. దేశ ఐక్యత, శాంతిసౌభాగ్యాల సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములం కావాలి. నుదిటి సిందూరం చూసి కాల్చి చంపేసే ఉగ్ర మూకలను తుదముట్టించి, వారిని పెంచి పోషిస్తున్న ముష్కరులను అన్ని విధాలుగా కట్టడి చేసే శక్తి సామర్ధ్యాలు మనకు ఉన్నాయి. రక్షణ, అంతరిక్ష రంగాల్లో అభేద్యమైన స్థాయికి మన భారత దేశం చేరుతున్నందుకు ప్రతి ఒక్కరం గర్విద్దాము. గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి దృఢ నాయకత్వంలో రక్షణపరంగానే కాకుండా ఆర్థికంగా పటిష్ట స్థితిలో ఉంటూ… అంతర్జాతీయంగా మూడో స్థానానికి చేరువయ్యాము. దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగకుండా ఒకే తాటిపై ఉండటం మన బాధ్యత.
మంత్రి నారా లోకేష్:
అందరికీ 79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో యోధుల ప్రాణత్యాగ ఫలితమే ఈ స్వాతంత్య్రం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను కాపాడుకోవడం మనందరి బాధ్యత. గత వీరుల త్యాగాలను స్మరిస్తూ.. వికసిత్ భారత్ ను నిర్మిద్దాం. మనదేశాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు