బిహార్ లో ఇటీవల నిర్వహించిన ఓటర్ లిస్టు ప్రత్యేక సమగ్ర సవరణ లో 65 లక్షల మంది పేర్లను తొలగించిన సంగతి విదితమే. కాగా, ఆ 65 లక్షల మంది వివరాలను ఈ నెల 19 లోపు బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నెల 22 నాటికి సంబంధిత నివేదికను తమ ముందుంచాలని పేర్కొంది. అదేవిధంగా.. ఓటర్ లిస్ట్ లో పేర్లు లేనివారు ఆధార్ కార్డు సమర్పించవచ్చని తెలిపింది. బిహార్ లో ఎస్ఐఆర్ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు లో ఈరోజు విచారణ జరిగింది. ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను ఆగస్టు 19 నాటికి బహిర్గతం చేయాలని ఈసీకి సుప్రీం కోర్టు ఆదేశించింది. తొలగింపునకు కారణాలుతో పాటు ప్రచురించి జిల్లా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంచాలని తెలిపింది. ప్రసార మాధ్యమాల ద్వారా దీనిపై ప్రచారం కల్పించాలని పేర్కొంది. తన ఆదేశాలపై తీసుకున్న చర్యలపై ఈనెల 22లోగా నివేదికను దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు