ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో నిర్వహించిన డాక్టర్ అఖిలేష్ దాస్ గుప్తా మెమోరియల్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ షటిల్ బాడ్మింటన్ క్రీడా పోటీల్లో గూడూరు క్రీడా కారుడు షేక్ గౌస్ సత్తా చాటాడు. హోరాహోరీగా సాగిన షటిల్ పోటీల్లో ద్వితీయ స్థానాన్ని సాధించాడు. షేక్ గౌస్ – ప్రకాష్ రాజ్ జట్టు రన్నర్స్‌గా నిలిచింది. ప్రథమ స్థానంలో శివం శర్మ, సంతోష్ జట్టు నిలిచింది. గూడూరు క్రీడాకారులను పలువురు అభినందించారు.
Previous Articleకడప జిల్లాలో పర్యటించనున్న YS జగన్
Next Article AMC చైర్మన్ గా గాలి రామకృష్ణారెడ్డి ఎంపిక