పర్చూరు శాసనసభ సభ్యులు ఏలూరి సాంబశివరావు ప్రతిష్టాత్మక బ్రిటన్ పార్లిమెంట్ విజనరీ లీడర్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ అరుదైన అవార్డు సాధించిన ఏలూరికి సీఎం చంద్రబాబు, మంత్రులు ఫోన్ చేసి అభినందించారు.’విజనరీ లీడర్’ అవార్డు సాధించిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారికి అభినందనలు. ప్రజలలో ఒకరిగా ఉంటూ, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న నిత్య కృషీవలుడికి సముచిత గౌరవం దక్కడం ఆనందదాయకమని టీడీపీ అగ్రనేత, మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ నేత ఏలూరికి ఈ అవార్డు రావడం పట్ల తెలుగు దేశం శ్రేణులు తమ సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఎమ్మెల్యే ఏలూరికి బ్రిటన్ పార్లిమెంట్ విజనరీ లీడర్ అవార్డు:తెలుగు దేశం శ్రేణుల హర్షం
By admin1 Min Read