మరొక కీలక ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహాన్ని ఇస్రో అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ఎలాన్ మస్క్ కు చెందిన ‘స్పేస్ఎక్స్’కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా చేపట్టిన ఈ ప్రయోగం సఫలమైంది.
ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్లో ఉన్న లాంచ్ కాంప్లెక్స్ 40 నుండి తాజాగా ఈ ప్రయోగం చేపట్టారు. అత్యంత సంక్లిష్టమైన, కీలకమైన ఈ శాటిలైట్ 34 నిమిషాలు ప్రయాణించినిర్దేశిత కక్ష్యలోకి చేరింది.
ఇస్రో వాణిజ్య విభాగం ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’ ద్వారా చేపట్టిన జీశాట్-20 ప్రయోగం అత్యంత కీలకమైనదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 4,700 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహం పూర్తి వాణిజ్య అవసరాలకు సంబంధించినది. దీని ద్వారా మారుమూల ప్రాంతాల్లో కూడా బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించవచ్చు. అలాగే విమానాల్లో ప్రయాణికులకు ఇంటర్నెట్ సేవలను వైఫై సౌకర్యాన్ని కల్పించవచ్చు. ఇస్రో, స్పేస్ఎక్స్ మధ్య మొదటి భాగస్వామ్యం ఇదేనని తెలిపారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

