ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ మూడు నెలల్లో విశాఖకు వస్తుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఐదుసంవత్సరాలలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. ఐటీలో టాప్ 100 కంపెనీలను ఏపీకి రప్పించేందుకు కృషి చేస్తున్నాం. విశాఖ కేంద్రంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కన్వెన్షన్ సెంటర్, టూరిజం, రియల్ ఎస్టేట్ రంగాలతో సోషల్ ఎకోసిస్టమ్‌ని అభివృద్ధి చేస్తున్నాం.
2019-24 మధ్య ఒక్క కాంక్లేవ్ జరగలేదు. ఒక్క పరిశ్రమ కూడా రాలేదని గతంలో హైదరాబాద్ లో రేస్ జరిగింది. దీన్ని ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారని అడిగితే అప్పటి మంత్రి కోడి గుడ్డు పెట్టలేదని సమాధానమిచ్చారన్నారు. అప్పటినుండి ఎక్కడికెళ్లినా ఐటీ మంత్రి ఇలా ఉంటారా అని ఏపీకి అవమానం జరిగింది. నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పలు కంపెనీలను కలిస్తే గత ప్రభుత్వంలో వాళ్లు వాటాలడిగారని చెప్పారు. దీంతో పరిశ్రమలు వెళ్లిపోయాయని లోకేశ్ దుయ్యబట్టారు.
Previous Articleవిడాకుల వచ్చే వరకూ…భార్యకు అన్నింటా హక్కు…!
Next Article అక్టోబర్ నెలలో మోస్ట్ పాపులర్ టాప్ 10 నటీనటులు