స్వర్ణాంధ్ర-2047 విజన్ లో ఉపాధి కల్పన లక్ష్యంగా, కొత్త పాలసీలు తీసుకుని వచ్చినట్లు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పలు అంశాలపై మాట్లాడారు. కూటమి వచ్చాక చాలా పాలసీలు తీసుకువచ్చినట్లు వివరించారు. మంచి పాలసీలు రాష్ట్ర రూపురేఖలు మారుస్తాయని పేర్కొన్నారు. భూమి, మద్యం, ఎంఎస్ఎంఈ, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్, టూరిజం, స్పోర్ట్స్, డ్రోన్, స్కిల్ డెవలప్‌మెంట్ పాలసీలు తెచ్చామని చెప్పారు. ఈ పాలసీలు అమలు చేయడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని స్పష్టం చేశారు మీ.నైపుణ్య శిక్షణ, మానవ వనరుల వృద్ధి పైన దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు.ఇక గేర్ మార్చాల్సిన సమయం వచ్చింది. పరిపాలనలో దూకుడుగా ఉంటాం. టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకెళ్తామని తెలిపారు.
జగన్ అవినీతి పై అమెరికాలో వేసిన చార్జ్ షీట్ గురించి అందరూ చూశారని ప్రభుత్వం దీనిపై తదుపరి అధ్యయనం చేసి, చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా, ఏ వ్యక్తి అయినా అవినీతి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయిలో, జగన్ నాశనం చేసాడని విమర్శించారు.ఇవన్నీ చూస్తుంటే బాధేస్తోందని అన్నారు.
ప్రతి ఒక్క ఎకరాకు నీరు ఇవ్వాలి, ప్రతి ఇంటికి తాగు నీరు ఇవ్వాలి, పరిశ్రమలకు సరిపడా నీరు ఇవ్వాలి. ఇవి మనం సాధించాలి అంటే, నదుల అనుసంధానం ఒక్కటే మార్గమని పోలవరం పూర్తయ్యి, నదుల అనుసంధానం పూర్తయితే, మన రాష్ట్రానికి ఇక తిరుగు ఉండదని అన్నారు.
విజన్ స్వర్ణాంధ్ర-2047
విజన్ స్వర్ణాంధ్ర-2047లో భాగంగా, ఏపీని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తయారు చేసి, గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
స్వర్ణాంధ్ర-2047 విజన్ లో ముఖ్యమైనది స్వచ్చ ఆంధ్రప్రదేశ్ అని స్వచ్చ ఆంధ్రప్రదేశ్ ని ఒక ఉద్యమ స్పూర్తితో తీసుకుని వెళ్లనున్నట్లు తెలిపారు.మౌలిక సదుపాయాల అభివృద్ధితోనే స్వర్ణాంధ్ర-2047 సాధ్యం అవుతుందని వివరించారు. రోడ్డు, రైల్, పోర్టు కనెక్టివిటీ పెరగాలని పోర్టులను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
రాజధాని నిర్మాణానికి టైం బౌండ్ ప్రోగ్రాంతో ముందుకు వెళ్తున్నాం. డిసెంబర్ నుండి పనులు మొదలు పెడుతున్నాం. 3 ఏళ్ళ లోపే రాజధాని అమరావతికి ఒక రూపు వస్తుందని వివరించారు.
పోలవరాన్ని గాడిన పెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.
గత 5 ఏళ్ళలో పోలవరం ప్రాజెక్ట్ ని నాశనం చేసారు. పనులు రివర్స్ లోకి వెళ్ళాయి. మళ్ళీ వెనక్కు వెళ్లి పనులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పోలవరాన్ని గాడిన పెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. డిసెంబర్ 2027 నాటికి పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం.
Previous Articleవాయు కాలుష్యం పై ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్: నివారణకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపు
Next Article సెమీ ఫైనల్ లో సాత్విక్- చిరాగ్ ద్వయం