అదానీతో జగన్ మోహన్ రెడ్డి గారు చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం తక్షణం రద్దు చేయాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు.
అక్రమ డీల్ తో 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం రూ. 1.50 లక్షల కోట్లు కాబట్టి వెంటనే ఈ డీల్ రద్దు చేయాలని టీడీపీ-జనసేన-బీజేపి కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ లక్షా 50వేల కోట్ల రూపాయల దోపిడిలో జగన్ గారికి ముట్టే వాటాలు ఎంత? ఇందంతా తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సర్దుబాటు చార్జీల పేరుతో రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.17వేల కోట్ల భారం మోపారు. దీనికి అదనంగా అదానీతో చేసుకున్న అక్రమ ఒప్పందాలకు ప్రతి ఏటా రూ.5వేల కోట్ల భారం పడనుందని షర్మిల లేఖలో పేర్కొన్నారు.
అదానీతో @gautam_adani జగన్ మోహన్ రెడ్డి @ysjagan గారు చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం తక్షణం @ncbn రద్దు చేయాలి.
అక్రమ డీల్ తో 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం రూ. 1.50 లక్షల కోట్లు కాబట్టి వెంటనే ఈ డీల్ రద్దు చేయాలని @JaiTDP @JanaSenaParty @BJP4Andhra కూటమి… pic.twitter.com/RjPJQwco01— YS Sharmila (@realyssharmila) November 25, 2024