అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ సీఎం జగన్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజాగా సీఎం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడిన అంశాలపై షర్మిల విమర్శలు గుప్పించారు. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.
అదానీతో మీ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా చరిత్ర అని దుయ్యబట్టారు. అదానీ కలవడం ఒక చరిత్ర. రూ.1750 కోట్లు నేరుగా ముఖ్యమంత్రికి ముడుపులు ఇవ్వడం చరిత్ర. ఎవడు కొనేందుకు ముందుకు రాని విద్యుత్‌ను బంపర్ ఆఫర్‌గా ప్రకటించుకోవడం చరిత్ర. గంటల్లోనే క్యాబినెట్ పెట్టడం చరిత్ర. ప్రజా అభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చరిత్ర. అదానీ కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం చరిత్ర. ఒక వ్యక్తి స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.1.67 లక్షల కోట్ల భారాన్ని మోపడం చరిత్ర. ప్రపంచం మొత్తం ఇప్పడు తమరి అవినీతి గురించి మాట్లాడుకోవడం మీ గొప్ప చరిత్ర. భూగోళం అవినీతి పరుల జాబితాలో మీపేరు చేరడం మీకు పెద్ద చరిత్ర అంటూ షర్మిల ఎద్దేవా చేశారు. అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే.. ఆగమేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా ? అని ప్రశ్నించారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్ట్ లో నాపేరు ఎక్కడుందని బుకాయించే జగన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటే ఆనాడు మీరు కారా.. ఆ కుర్చీలో మీరు కాకుండా మిమ్నల్ని నడిపించే వాళ్లు కూర్చున్నారా..? ఇదేం ఆఫ్ బేస్ట్ నాలెడ్జ్ ? ఇదేం అహంకారపు తిరస్కరణ సమాధానం..? మీరు అవినీతి చేశారని చెప్పింది మేము కాదు. అమెరికా అధికారిక దర్యాప్తు సంస్థలు FBI, SEC స్వయంగా రిపోర్ట్ ఇచ్చాయని షర్మిల విమర్శించారు. నిజంగా అదానీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే, అదానీతో రహస్య ఒప్పందాలు జరగకుంటే, అమెరికా దర్యాప్తు సంస్థలు మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే, మీరు అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయండి. దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సవాల్‌ను స్వీకరించాలని షర్మిల అన్నారు.
అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ సీఎం జగన్ గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: ఏపీసీసీ చీఫ్ షర్మిల
By admin2 Mins Read