భారత మాజీ లెజెండరీ క్రికెటర్ మొహిందర్ అమర్ నాథ్ జ్ఞాపకాలతో సిద్ధం చేసిన ‘ఫియర్ లెస్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ పాల్గొన్నారు. భారత విదేశాంగ విధానంలో అవలంభిస్తున్న తీరు, అంతర్జాతీయ వేదికలపై భారత్ దూకుడును క్రికెట్ తో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పాక్ విషయంలో మారిన భారత వైఖరిని ఆయన క్రికెట్ తో పోలుస్తూ చెప్పారు.
1983 భారత క్రికెట్ కు ఒక టర్నింగ్ పాయింట్ అనడంలో అతిశయోక్తి లేదని అన్నారు. పాకిస్థాన్ ఓ దశలో ప్రపంచ కప్పును గెలిచింది. శ్రీలంక కూడా గెలుచుకొంది. కానీ, 1983 అనేది క్రికెట్ చరిత్రలోనే కీలక మలుపు. ఎందుకంటే ఆ తర్వాత భారత క్రికెట్ ఏవిధమైన మార్పులు చూసిందో అదే విధంగా విదేశాంగ విధానం, క్రికెట్ లో వచ్చే మార్పులతో పోల్చడానికి ఎప్పుడూ ఇష్టపడతానని అన్నారు. చాలామంది విదేశాంగ విధానాన్ని చదరంగంతో పోల్చేందుకు ఇష్టపడతారని అయితే దానికి, దీనికి ఎలాంటి పోలిక లేదు. విదేశాంగ విధానం క్రికెట్లానే ఉంటుందన్నారు. విభిన్నంగా ఆలోచించడం, మానసికంగా సిద్ధంగా ఉండటం, ఎదుటి వారి ఆలోచనలు పసిగట్టడం సంక్లిష్టమైన విషయాలను ప్రజలకు వెల్లడించడంలో క్రికెటర్లతో సారూప్యతలు ఉంటాయని పేర్కొన్నారు.
ప్రపంచం ఎటువంటి భారత్ తో డీల్ చేయాలనుకుంటోందో అలాంటి భారత్ ప్రస్తుతం ఉందని అన్నారు. ప్రపంచ వ్యవహారాల్లో మంచి ప్రమాణాలను నెలకొల్పుతోందన్నారు. ఈసందర్భంగా పాకిస్థాన్ లో భారత జట్టు 1982-83లో పర్యటించిన సందర్భాన్ని గుర్తు చేశారు. అక్కడ మనవాళ్లు సంప్రదాయ ఆటతీరు నుంచి బయటకొచ్చి.. దూకుడును ఎంచుకొని మెరుగ్గా ఆడారని అన్నారు. పాక్ విదేశాంగ విధానంలో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ దొరకదని జైశంకర్ విశ్లేషించారు.
ఇక మొహిందర్ అమర్నాథ్ భారత మాజీ సీనియర్ క్రికెటర్.ఆయన 1969-89 మధ్యలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. టెస్టుల్లో 4,378 పరుగులు చేశారు. 1983 వన్డే ప్రపంచకప్ సెమీస్, ఫైనల్స్లో మొహిందర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. ఆయన మొత్తం 9 శతకాలు చేయగా..7 విదేశీ గడ్డపైనే సాధించడం విశేషం.
భారత మాజీ క్రికెటర్ అమర్ నాథ్ జ్ఞాపకాలతో సిద్ధం చేసిన’ఫియర్ లెస్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి జై శంకర్
By admin2 Mins Read
Previous Articleఅబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ సీఎం జగన్ గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: ఏపీసీసీ చీఫ్ షర్మిల
Next Article వారాంతంలో దేశీయ సూచీల జోరు..!