నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఐటీ, టెక్స్ టైల్ పాలసీలకు ఆమోద ముద్ర పడనుంది. టూరిజం, స్పోర్ట్స్, మారిటైమ్ పాలసీల సవరణలను ఆమోదించే అవకాశం ఉంది. ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద పెండింగ్ గృహాల నిర్మాణం పూర్తిపై నిర్ణయం తీసుకోనున్నారు. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం అంశంపైనా ముఖ్యమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Previous Articleహరీశ్ రావుపై కేసు నమోదు…!
Next Article మే18న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష