విశాఖపట్నంలో జరిగిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ లో ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ నాలెడ్జ్ హబ్ గా తయారవుతుందని తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నాలెడ్జ్ ఎకానమీలో యువత రాణిస్తున్నారని పేర్కొన్నారు. విదేశాలలో ఉన్న ఐటీ నిపుణులలో 30 శాతం తెలుగు వారేనని అన్నారు. జీవితంలో టెక్నాలజీ ఒక భాగంగా మారిందని ప్రస్తుతం ప్రపంచమంతా టెక్నాలజీ మీదే చర్చ జరుగుతోందని అన్నారు. 1995లో మొదటి సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. పీపీపీ మోడల్ లో హైటెక్ సిటీ నిర్మించినట్లు తెలిపారు. ఇకపై ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకెళ్లనున్నట్లు వివరించారు. డీప్ టెక్నాలజీతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. డ్రోన్ల వినియోగం కూడా పెరుగుతోందని అన్నారు. ఏపీ ఆహారం ఉత్పత్తులు, సరఫరాల లో ప్రపంచ హాబ్ గా మారిపోతుందని అన్నారు. రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయని నదుల అనుసంధానంతో నీటి కొరత ఉండదని అన్నారు. తీరప్రాంతం కూడా ఏపీకి కలిసొచ్చే అంశం అని అన్నారు. పెట్టుబడులకు అనువైన వాతావరణం రాష్ట్రంలో ఉందని అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. వినూత్న ఆవిష్కరణలు, ఔత్సాహికుల ప్రణాళికలు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు