ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజున నేడు తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాగా, బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సీఎం మాట్లాడారు. వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు. తర్వాత తల్లిదండ్రులు, పూర్వవిద్యార్థుల సూచనలు, సలహాలు విన్నారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుండే ప్రారంభం కావాలని అన్నారు. పిల్లల చదువులు తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు.ప్రైవేటు స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలని తయారు చేసి, మన పిల్లలని ప్రయోజకులని చేసే బాధ్యత మా ప్రభుత్వానిది.మన ముందు ఉన్న టెక్నాలజీ, అవకాశాలతో ఏదైనా సాధ్యం. కొత్త విషయాలు నేర్చుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలని సూచించారు.పిల్లలు స్కూలు రాకపోతే ఫోన్‌కు మెసేజ్ వచ్చే ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షా ఫలితాలు, ఆరోగ్య విషయాలు కూడా తల్లిదండ్రుల ఫోన్‌కు మెసేజ్‌లు వస్తాయి. మీ పనుల్లో మీరుండి పిల్లల చదువును నిర్లక్ష్యం చేయవద్దు.భారత దేశ గొప్ప సంపద కుటుంబ వ్యవస్థ. నైతిక విలువలతో పిల్లలను పెంచాలి. మన పిల్లలు మనకు ఆస్తిగా తయారు అవ్వాలని చెప్పారు. డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలని అవి మానవ సంబంధాలను నాశనం చేస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిరోధానికి ఈగల్ పేరుతో ఒక వ్యవస్థను తీసుకొచ్చిమని దానితో ఆ రక్కసిని అణచివేస్తామని పేర్కొన్నారు. సమావేశం అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రుల సహపంక్తి భోజనాలకు 23 ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పిల్లలతో కలిసి భోజనం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు