కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో పేరెంట్ – టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పాఠశాల తరగతి గదులను, విద్యార్థినులు వేసిన రంగవల్లులు పరిశీలిస్తూ, విద్యార్ధిని, విద్యార్థులతో ముచ్చటించి, వారు సృష్టించిన సైన్స్ పరికరాల వివరాలను స్వయంగా ఆయన తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే శ్రీమతి మాధవి రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య, జిల్లా అధికార యంత్రాంగం హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కడపని ఎందుకు ఎంచుకున్నాను అంటే, ఇది ఎక్కువ గ్రంధాలయాలు ఉన్న నేల ఇది అని చదువుల నేల కడపని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చిత్తశుద్దిగా ఉందని పిల్లల తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టాలి.తీరని సమస్యలు తీర్చే బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. అధ్యాపకులకు ఎక్కువ జీతం వచ్చే రోజు రావాలని ఎంత వరకు సాధ్యమో తెలీదు కానీ నేనైతే ప్రయత్నం చేస్తానని చెప్పారు.పౌష్టికాహారం పిల్లలకే కాదు, అధ్యాపకులకు అందాలి. హీరోలని సినిమాల్లో నటించేవారిలో కాదు, మీ అధ్యాపకుల్లో చూసుకోండని పిల్లలకు సూచించారు. పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని తల్లిదండ్రులు నియంత్రించాలిని సూచించారు. చదువుకి, వికాసానికి వాడుతున్నారా చెడు మార్గాల వైపు వెళ్తున్నారా చూస్తూ ఉండాలని పేర్కొన్నారు.మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ వేదికపై మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను ప్రతిబింబిస్తూ “డ్రగ్స్ వద్దు బ్రో” క్యాంపెయిన్ పోస్టర్ ను ఆవిష్కరించారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో కిచెన్ ఆధునీకరణకు నిధులు లేవు అనే సమస్య నా దృష్టికి తీసుకొచ్చారు, అందుకు అవసరమైనంత నా వ్యక్తిగత ట్రస్ట్ ద్వారా అందిస్తానని పవన్ భరోసానిచ్చారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నాణ్యత పరిశీలించేందుకు కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
హీరోలను మీ అధ్యాపకుల్లో చూసుకోండి ! #MegaPTM#MegaParentTeacherMeeting pic.twitter.com/tEuBOaQGPD
— JanaSena Party (@JanaSenaParty) December 7, 2024

