ఏఐ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేలా పాఠ్యప్రణాళికలను రూపొందించి, మెరుగైన సామర్థ్యాలతో గ్రాడ్యుయేట్లను తయారుచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఆంధ్రా యూనివర్సిటీ యాన్యువల్ అల్యూమిని మీట్‌కి గౌరవ అతిధిగా లోకేష్ హాజరు అయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావడానికి అల్యూమిని ప్రముఖులు సహకారం అందించాలని ఈసందర్భంగా లోకేష్ కోరారు. ఎల్అండ్‌టి చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్, ఎంపీ భరత్, జిఎంఆర్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు పద్మశ్రీ డాక్టర్ ఎస్ వి ఆదినారాయణరావు తరఫున ఆయన సతీమణి శశిప్రభ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మెరుగైన సామర్థ్యాలతో గ్రాడ్యుయేట్లను తయారుచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం: మంత్రి నారా లోకేష్
By admin1 Min Read
Previous Articleబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం
Next Article ఛత్తీస్‌గఢ్ లో మహిళను హత్య చేసిన నక్సల్స్