బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు (డే/నైట్) లో భారత్ పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో 175 పరుగులకే కుప్పకూలింది. మూడో రోజు 128-5 ఓవర్ నైట్ స్కోర్ తో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మరో 47 పరుగులు మాత్రమే చేయగలిగింది. నితీష్ రెడ్డి 42 (47;6×4, 1×1) టాప్ స్కోరర్. రిషబ్ పంత్ 28 బ్యాటింగ్ (31; 5×4), శుభ్ మాన్ గిల్ 28(30;3×4), యశస్వీ జైశ్వాల్ 24(31;4×4) పర్వాలేదనిపించారు. కే.ఎల్.రాహుల్ (7), విరాట్ కోహ్లీ (11), రోహిత్ శర్మ (6), విఫలమయ్యారు. టెయిలండర్లు అశ్విన్ (7), సిరాజ్(7), హార్షిత్ రాణా (0), బుమ్రా 2 నాటౌట్ కూడా బ్యాట్ ఝళిపించలేదు. దీంతో భారత్ ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కంటే కేవలం 18 పరుగులు ఆధిక్యాన్ని మాత్రమే చేయగలిగింది. దీంతో 19 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా మ్యాచ్ గెలిచి సిరీస్ లో 1-1 తో సమంగా నిలిచింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో కమ్మిన్స్ 5 వికెట్లతో అదరగొట్టాడు. బొలాండ్ 3 వికెట్లు, స్టార్క్ 2 వికెట్లు తీశారు.
భారత్ మొదటి ఇన్నింగ్స్:180-10 (44.1)
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 337-10 (87.3)
భారత్ రెండో ఇన్నింగ్స్: 175-10(36.5)
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 19-0 (3.2).
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు