దీపం 2.O పథకం విజయవంతంగా అమలవుతోందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ రోజు వరకూ రూ.476.15 కోట్లు సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేసినట్లు వివరించారు. ఉచిత గ్యాస్ సిలెండర్ ను లబ్ధిదారులైన ఆడపడుచులకు అందించే బృహత్తర కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం సఫలమైందని పేర్కొన్నారు. దీపం 2.O పథకం అమలును తెలిపే గణాంకాలను సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
పథకం అమలుకు మార్గనిర్దేశనం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. దీపం 2.O కు సహకరిస్తున్న ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. పారదర్శకంగా పాలించే మంచి ప్రభుత్వం ఇదని మనోహర్ పేర్కొన్నారు.
దీపం 2.O పథకం విజయవంతంగా అమలవుతోంది. ఈ రోజు వరకూ రూ.476.15 కోట్లు సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేశాము. ఉచిత గ్యాస్ సిలెండర్ ను లబ్ధిదారులైన ఆడపడుచులకు అందించే బృహత్తర కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం సఫలమైంది. దీపం 2.O పథకం అమలును తెలిపే గణాంకాలు ఇవి.
పథకం అమలుకు మార్గనిర్దేశనం… pic.twitter.com/59TCX8RhHh— Manohar Nadendla (@mnadendla) December 10, 2024