కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పలువురు సహాచర మంత్రులతో సమావేశమై వివిధ అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని తూర్పుకాపు, కళింగవైశ్య, శిష్ఠకరణ, సొండి, అరవ కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని ఎంపీ విజయనగరం కలిశెట్టి అప్పలనాయుడు, పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష సహా పలువురు నాయకులతో కలిసి కేంద్ర న్యాయశాఖ మంత్రి డాక్టర్ శ్రీ వీరేంద్రకుమార్ ను కోరారు. గత 10 ఏళ్లుగా పార్లమెంటులో, ఎన్సీబీసీ కమిషన్ లో పోరాడుతున్న నేపథ్యంలో.. వీలయినంత వేగంగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆయనను కోరారు.ఈమేరకు వినతిపత్రం అందజేశారు.
ఇక శ్రీకాకుళం జిల్లాలో హైవేల విస్తరణ, అప్ గ్రేడ్ అంశాలపై కేంద్ర రోడ్డు, రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయి చర్చించారు. ఈ సందర్భంగా నరసన్నపేట – ఇచ్ఛాపురం వరకు ఉన్న జాతీయ రహదారి 6 లైన్లకు విస్తరణ, సీఎస్పీ రోడ్డు (కళింగపట్నం – శ్రీకాకుళం – పార్వతీపురం), డీఎన్పీ రోడ్డు (డీఎల్ పురం – నరసన్నపేట – మెళియాపుట్టి వయా భావనపాడు పోర్టు) మార్గాలను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని కోరారు. ప్రాంతీయ అభివృద్ధి, ఇతర కీలక ప్రాజెక్టులతో సహా శ్రీకాకుళం సమగ్రతకు అవసరమైన రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చర్చించారు.
అలాగే కేంద్ర రైల్వేమంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ను కలిసి శ్రీకాకుళం – పలాస పరిధిలో రైల్వే ప్రాధాన్యాలు పై చర్చించారు. బెండి గేట్ సమస్య పరిష్కారం, పూండి స్టేషన్ అభివృద్ధి, ప్రజల సౌకర్యార్థం విశాఖ ఎక్స్ ప్రెస్, ప్రశాంతి ఎక్స్ ప్రెస్, పూరి – తిరుపతి రైళ్లకు స్టాపేజీ కల్పించాలని కోరారు.
Previous Articleసర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్టులో ఇచ్చే యూనిఫాం, బెల్టులు, బ్యాగ్‌ల రంగుల మార్పు
Next Article ఏపీలో ప్రతి నియోజకవర్గానికీ ఒక మోడల్ కాలనీ