ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తో ఎస్.ఏ.ఈ.ఎల్, నార్ఫండ్, ఎన్డీబీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ఐ.సీ.ఈ) పాలసీ కింద పెట్టుబడుల గురించి ఈసందర్భంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులను స్వాగతిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఎస్.ఏ.ఈ.ఎల్ వారు వినియోగించే వినూత్నమైన వేస్ట్-టు-ఎనర్జీ టెక్నాలజీని గురించి కూడా వివరించిందని పేర్కొన్నారు. వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించుకొని రైతుల ఆదాయాన్ని పెంచే ఇటువంటి ప్రాజెక్టులను ఏపీలో అభివృద్ధి చేయడానికి పూర్తి సహకారం అందించే దిశగా చర్చించినట్లు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న పరిస్థితుల గురించి చర్చించినట్లు పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు