ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను ఒక్కొకటిగా తొలగించుకుంటూ వస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇప్పటికే రూ.22 వేల కోట్ల విలువైన టెండర్లకు అధారిటీ ఆమోదం తెలిపింది, మరో రూ.20 వేల కోట్లకు నేడు జరిగే అధారిటీ సమావేశంలో ఆమోదం తీసుకోనున్నట్లు తెలిపారు. ఈరోజు వెంకటపాలెం వద్ద కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న విజయవాడ వెస్ట్ బైపాస్ పనులను మంత్రి పరిశీలించారు.
217 చదరపు కి.మీ ల పరిధిలో ఈస్ట్ నుంచి వెస్ట్ కు 16 రోడ్లు,నార్త్ నుంచి సౌత్ కి 18 రోడ్లు వస్తున్నాయి మరియు సీడ్ కేపిటల్ నుంచి E11,E13,E15 రోడ్లను జాతీయ రహదారికి కలపేలా డిజైన్లు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని రాజధాని నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. రోడ్లలో ఎక్కువగా ఉన్న అటవీ భూమి తీసుకునే ప్రక్రియ చివరి దశకు వచ్చిందని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు