భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఆయనకు కువైట్ తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ తో సత్కరించింది. కువైట్ ఎమిర్ షేక్ మిశాల్ అల్ అహ్మద్ అల్ జాబెర్- అల్ – సబా ఈ పురస్కారాన్ని మోడీకి అందించారు. వివిధ దేశాల నుండి ప్రధాని మోడీ అందుకున్న 20వ ఇంటర్నేషనల్ అవార్డు ఇది కావడం గమనార్హం. గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్ ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో ఉన్నారు.
ఇక కువైట్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ నేడు ఆ దేశ ఎమిర్ తో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య పటిష్టమైన సంబంధాలతో పాటు ఐటీ, ఫార్మా, ఫిన్ టెక్, భద్రత వంటి కీలక రంగాల్లో సహాకారం పై చర్చించినట్లు ట్వీట్ చేశారు. మరోవైపు క్రౌన్ ప్రిన్స్ షేక్ బాబా అల్-ఖాలీద్ అల్-సబాతో కూడా సమావేశమయ్యారు. రక్షణ, వాణిజ్య రంగాలపై చర్చించారు.
Previous Articleమహిళలకు ఫ్రీ బస్ పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: ఏపీసీసీ చీఫ్ షర్మిల
Next Article అల్లు అర్జున్ కు మేము వ్యతిరేకం కాదు : డీజీపీ