పౌరులుగా అందరూ బాధ్యతాయుతంగా ఉండాలని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు.సంధ్య థియేటర్ ఘటనపై ఆయన స్పందించారు.వ్యక్తిగతంగా తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు.“సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం.అల్లు అర్జున్ కు మేం వ్యతిరేకం కాదు.చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకున్నాం.పౌరుల భద్రత, రక్షణ అన్నింటికంటే ముఖ్యం.ఆయన సినీ హీరో కావొచ్చు.. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవాలి.ఇలాంటి ఘటనలు పౌరుల భద్రతకు మంచిది కాదు.ప్రజల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదు.జర్నలిస్టుపై దాడి కేసులో సినీనటుడు మోహన్ బాబు పై కేసు నమోదు చేశాం.చట్ట ప్రకారం ఆయనపై చర్యలు
ఉంటాయి ‘ అని ఆయన అన్నారు.
Previous Articleకువైట్ అత్యున్నత పురస్కారం అందుకున్న భారత ప్రధాని మోడీ
Next Article వైభవంగా స్టార్ షట్లర్ సింధు వివాహం

