విజయవాడలోని ‘ఏ ప్లస్ కన్వెన్షన్’లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున జరుగుతున్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మైనారిటీల సంక్షేమానికి, భద్రతకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పేదల పట్ల ధర్మాన్ని నమ్మిన వారి పట్ల దేవుడు ఎప్పుడూ అండగా ఉంటాడని పేర్కొన్నారు. తాను సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రీ క్రిస్మస్ వేడుకలు అన్ని జిల్లాలలో జరిపినట్లు గుర్తు చేసుకున్నారు.
గడిచిన 5 ఏళ్ళలో రాష్ట్రంలో ఏం జరిగిందో చూసారని మళ్ళీ చెడు రాకుండా ఉండాలి అంటే, చెడుని గుర్తు చేసుకుంటూ ఉండాలని అన్నారు. తమ ప్రభుత్వం క్రిస్టియన్లకు అండగా ఉంటుందని ఈసందర్భంగా భరోసా ఇచ్చారు.
మైనారిటీల సంక్షేమానికి, భద్రతకు అండగా ఉంటాం: సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read
Previous Articleప్రముఖ దర్శకులు శ్యామ్ బెనెగల్ కన్నుమూత
Next Article అలరిస్తున్న బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ పాట