ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయిన వారి పేర్లను ప్రకటించింది. ఈ సంవత్సరం అత్యుత్తమ ఆటతీరు కనబరిచిన వారికి ఈ అవార్డును ఇస్తారు. నలుగురు ఆటగాళ్లు షార్ట్ లిస్ట్ కాగా ఇందులో భారత్ నుండి బౌలర్ అర్ష్ దీప్ సింగ్ కు అవకాశం లభించింది. పాకిస్థాన్ నుండి బాబర్ అజామ్, జింబాబ్వే నుండి సికందర్ రాజా, ఆస్ట్రేలియా నుండి ట్రావిస్ హెడ్ నామినేట్ అయ్యారు. ఇక మహిళల విభాగంలో శ్రీలంక కు చెందిన చమరి ఆటపట్టు, న్యూజిలాండ్ కు చెందిన మెలీకెర్, ఐర్లాండ్ క్రికెటర్ ఓర్లా ప్రెండర్ గాస్ట్, సౌతాఫ్రికా క్రికెటర్ లారా ఓల్వార్ట్ నామినేట్ అయ్యారు.
Previous Articleయూట్యూబ్ టాప్‌లో కుర్చీ మడతపెట్టి…!
Next Article డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన సౌతాఫ్రికా