ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు మొదటి సారి సౌతాఫ్రికా అర్హత సాధించింది. పాకిస్థాన్ తో తాజాగా జరిగిన టెస్టు మ్యాచ్ లో గెలిచి డబ్ల్యూటీసీ తుది పోరుకు అర్హత సాధించింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ టెస్టులో సౌతాఫ్రికా రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. 148 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్ నైట్ స్కోరు 27/3తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా మార్‌క్రమ్ (37), తెంబా బావుమా (40) రాణించడంతో సునాయసంగా లక్ష్యం వైపు దూసుకెళ్లేలా కనిపించింది. ఒక దశలో 93/4 స్కోరుతో మెరుగైన స్థితిలో ఉన్న ఆ జట్టు అనంతరం 12 బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది.
ఈ క్రమంలో టెయిలెండర్ కగిసో రబాడ (31) మంచి పోరాటం కనబరిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మార్కో యాన్సెన్ (16) రబడాకు మంచి సహాకారం అందించాడు. రెండో ఇన్నింగ్స్ లో పాక్ పేసర్ మహ్మద్ అబ్బాస్ (6/54) సత్తాచాటాడు. ఈ మ్యాచ్ విజయం తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్స్ టేబుల్ లో సౌతాఫ్రికా (66.67%) అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (58.89%) భారత్ (55.88%) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్ (48.21%), శ్రీలంక (45.45%) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు