బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భారత జట్టు ప్రదర్శనపై అభిమానుల నుండి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా నాలుగో టెస్టులో ఓటమితో కోచ్ గంభీర్ పైనా, సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరి ప్రదర్శన తీవ్రంగా నిరాశ కలిగించింది. విరాట్ ఈ సిరీస్ లో సెంచరీ చేశాడు. మిగిలిన సార్లు నిరాశ పరిచాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ నేపథ్యంలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ ఆటగాళ్లు ఇద్దరూ వైదొలగాలని మరోవైపు గంభీర్ కూడా ప్రధాన కోచ్ పదవికి అనర్హుడంటూ సోషల్ మీడియా లో కామెంట్ లు చేస్తున్నారు.
ఈక్రమంలో ఆసీస్ మాజీ కోచ్ డారెన్ లీమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ వీరిద్దరూ రిటైర్ అయినా భారత క్రికెట్ కు ఎలాంటి నష్టం లేదని అభిప్రాయపడ్డాడు. జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్ పై అతడు ప్రశంసల వర్షం కురిపించాడు.
రానున్న రోజుల్లో విరాట్, రోహిత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎంతో కాలంగా జట్టుకు సేవలు అందించారు. ఒకవేళ రిటైర్మెంట్ తీసుకున్నా కూడా భారత క్రికెట్ కు ఇబ్బంది లేదు. జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు రాణిస్తున్నారని వివరించాడు. మెల్ బోర్న్ లో యశస్వి చాలా బాగా ఆడాడని కితాబిచ్చాడు. పెర్త్ లో కూడా భారీ శతకం సాధించాడన్నాడు. బుమ్రా పైనా ప్రశంసలు కురిపించాడు. అత్యుత్తమ బౌలర్ అని అన్నాడు. అలాగే అతడి కెప్టెన్సీ పైనా పొగడ్తలు కురిపించాడు.
రోహిత్-కోహ్లీ రిటైరైనా భారత్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు: ఆసీస్ మాజీ కోచ్ డారెన్ లీమన్
By admin1 Min Read

