ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని ఏపీ సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం సీఎం చంద్రబాబుకు పండితులు వేదాశీర్వచనాలు ఇచ్చారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
ఇక సీఎం చంద్రబాబు నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గమ్మ ఆశీస్సులతో అందరికీ ఆరోగ్యం, ఆనందం, ఆదాయం సమకూర్చే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకులు ఏపీ సీఎం చంద్రబాబును ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ క్యాలెండర్, డైరీ, స్వామివారి చిత్రపటాన్ని ఈఓ శ్యామలరావు ఆయన కు అందజేశారు.