భారత జట్టు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మెరుగుపడడంతో ఆయన హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో థానేలోని ఒక హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిబాగవడంతో డిశ్చార్జి అయ్యారు. 52 సంవత్సరాల కాంబ్లీ ప్రజలను మద్యానికి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని నూతన సంవత్సరం సందర్భంగా సందేశాత్మక వీడియో కూడా చేసిన విషయం తెలిసిందే. చెడు వ్యసనాలు జీవితాన్ని నాశనం చేస్తాయని పేర్కొన్నాడు. భారత క్రికెట్ జట్టు జెర్సీ వేసుకుని హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయిన సందర్భంగా ఆయన కనిపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Previous Articleరామ్ చరణ్ “గేమ్ చేంజర్”ట్రైలర్ విడుదల
Next Article దబిడి దిబిడి పాట వచ్చేసింది…!