మలేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో డబుల్స్ లో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం తాజాగా జరిగిన ప్రీ క్వార్టర్స్ లో గెలిచి క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ఏడో సీడ్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి 21-15, 21-15తో మలేషియాకి చెందిన నూర్ మహ్మద్, వీ కియోంగ్ టాన్ పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో స్టార్ షట్లర్ ప్రణయ్ 8-21, 21-15, 21-23 తో చైనాకు చెందిన షై యుకి చేతిలో ఓటమి చెందాడు. మరోవైపు మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ లో మాళవిక బాన్సోద్ 18-21, 11-21తో చైనా క్రీడాకారిణి యూ హాన్ చేతిలో పరాజయం పాలైంది. మహీళల డబుల్స్ ప్రీ క్వార్టర్స్ లో గాయత్రీ-ట్రీసా జోడీ చైనాకు చెందిన ఫాన్ జియా- షియాన్ జాంగ్ జోడీ చేతిలో 21-15, 18-21, 19-21తో ఓటమి చెందింది. మిక్సెడ్ డబుల్స్ లో ధ్రువ్ కపిల-తనీషా క్యాస్ట్రో ద్వయం 13-21, 20-22తో చైనా ద్వయం చేతిలో ఓడింది.
Previous Articleఫోర్బ్స్ టాప్ 10 సంపన్నులు వీళ్లే..!
Next Article శ్రీలంకతో టెస్టు సిరీస్ కు కెప్టెన్ గా స్మిత్

