ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో వివిధ దేశాల దిగ్గజ ఆటగాళ్లను మరోసారి మైదానంలో చూసే అవకాశం క్రికెట్ ప్రేమికులకు రానుంది. పలువురు దిగ్గజ ఆటగాళ్లు ఈ లీగ్ ఆడబోతున్నారు. ఈ ఏడాది జరిగే ఆరంభ సీజన్లో భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు బరిలో దిగబోతున్నాయి. వచ్చే నెల 22 నుండి మార్చి 16 వరకు భారత్ లోనే మొదటి సీజన్ జరగనుంది. నవీ ముంబయి, రాజ్ కోట్, రాయ్ పూర్ మ్యాచ్ లకు వేదిక కానున్నాయి. ఈ సీజన్ లో తలపడే భారత్ కు సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ కు బ్రియాన్ లారా, శ్రీలంకకు సంగక్కర, సౌతాఫ్రికాకు జాక్వస్ కలిస్, ఇంగ్లాండ్ కు మోర్గాన్, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
Previous Articleహైదరాబాద్కు వచ్చిన ప్రియాంక చోప్రా.. మహేశ్ సినిమా కోసమేనా
Next Article ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్