వ్యాపార, పారిశ్రామిక రంగాలతో పాటు పలు రంగాల్లో నూతన సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకొస్తున్న యువపారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 16, 2016న ప్రవేశ పెట్టిన స్టార్టప్ ఇండియా పథకానికి నిన్నటికి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జనవరి 16ను కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టార్టప్ డే గా ప్రకటించింది. స్టార్టప్ ఎకోసిస్టమ్ లో ప్రపంచంలో మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో యునైటెడ్ కింగ్ డమ్, 3 వ స్థానంలో భారత్ ఉండగా..ఆ తర్వాతి స్థానాల్లో కెనడా, జర్మనీలు ఉన్నాయి.
డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డి.పి.ఐ.ఐ.టి) గణాంకాల ప్రకారం ప్రస్తుతం మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1.59 లక్షల స్టార్టప్ లు గుర్తింపు పొందాయి. కేంద్రం ప్రారంభించిన స్టార్టప్ ఇండియా మనదేశాన్ని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా తీర్చిదిద్దింది. ప్రత్యక్షంగా ఈ స్టార్టప్లు దాదాపు 17లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించాయి. 27,459 స్టార్టప్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. 15,851తో ఢిల్లీ 16,335తో కర్ణాటక తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యూనికార్న్ ల సంఖ్య 2016లో 11 నుండి 2024 నాటికి 118కి పెరిగింది. ఐటీ సేవల రంగంలో 17,618 స్టార్టప్ లు, హెల్త్ కేర్, లైఫ్ సైన్స్ 14,285, విద్యారంగానికి సంబంధించి 9,047 స్టార్టప్ల వృద్ధి రేటు గరిష్ట స్థాయికి చేరుకుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు