గుంటూరు జిల్లా నంబూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ పాల్గొన్నారు. గ్రామంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాన్ని పరిశీలించారు. చెత్త సేకరణ, నిర్వహణ, సంపద సృష్టి తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. చెత్త రవాణా వాహనం ప్రారంభించి, స్వయంగా నడిపారు. ఇటీవల విజయవాడ వరదల్లో అహర్నిశలు పని చేసి పారిశుద్ధ్య మెరుగుదలకు కృషి చేసిన 35 మంది స్వచ్ఛ కార్మికులను పవన్ కళ్యాణ్ సత్కరించారు. ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలుకరిస్తూ, శాలువా కప్పి నూతన వస్త్రాలు, పళ్లు బహూకరించారు. గ్రామ స్థాయిలో చెత్త సేకరణకు ఏర్పాటు చేసిన వాహనాలను ప్రారంభించి స్వయంగా నడిపారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా మొదటి విడతగా గ్రామ స్థాయిలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ప్రతి నెల మూడో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈకార్యక్రమంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పొన్నూరు శాసన సభ్యులు దూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు.
Previous Articleవారి బాధలు మీకు పట్టవా?: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
Next Article ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ