టీమ్ఇండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో అతను అదరగొడుతున్నాడు. మంగళవారం ఇంగ్లిష్ జట్టుతో జరిగిన మూడో టీ20లో వరుణ్ 24 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైనప్పటికీ వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ సూపర్ పెర్ఫామెన్స్‌తో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. అతను ఏకంగా 25 స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు.
ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఒక స్థానం మెరుగై తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇంగ్లిష్ జట్టు పేసర్ జోఫ్రా ఆర్చర్ 13 స్థానాలు జంప్ చేసి ఆరో ర్యాంకు సాధించాడు. భారత ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తొమ్మిదో స్థానంలో ఉండగా.. రవి బిష్ణోయ్ ఐదు స్థానాలు దిగజారి 10వ ర్యాంకుకు పడిపోయాడు. అక్షర్ పటేల్ ఐదు స్థానాలు మెరుగై 11వ ర్యాంకు దక్కించుకున్నాడు. టీ20ల్లో బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తిలక్ వర్మ ఒక స్థానం మెరుగై ఫిల్ సాల్ట్‌ను వెనక్కినెట్టి రెండో ర్యాంక్‌లో నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.