రొమేనియా టెన్నిస్ స్టార్ సిమోనా హెలెప్ టెన్నిస్ కు గుడ్ బై చెప్పింది. 33 ఏళ్ల హెలెప్ ట్రాన్సెన్వేలియా టోర్నీలో 1-6, 1-6 తో పరాజయం అనంతరం తన రిటైర్మెంట్ ప్రకటించింది. 2018లో ఫ్రెంచ్ ఓపెన్, 2019లో వింబుల్డన్ టైటిల్స్ గెలిచింది. 2017లో ప్రపంచ నెంబర్ వన్ గా అగ్రస్థానంలో నిలిచింది. తన కెరీర్ లో 24 సింగిల్స్ టైటిల్ లు గెలిచింది. నిషేధిత ఉత్ప్రేరకం వాడిందని ఆమెపై 4 ఏళ్ల నిషేధం విధించారు. కానీ ఆమె స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టులో అప్పీలు చేసింది. దీంతో ఆమెపై నిషేధం 9 నెలలకు తగ్గించి బడింది. అప్పటికే నిషేధం ముగియడంతో ఏప్రిల్ లో పునరాగమనం చేసింది. అయితే ఆ తర్వాత గాయాలతో సొంతమైంది. మోకాలి, భుజం గాయంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ అర్హత పోటీల నుండి వైదొలిగింది. చివరిగా గ్రాండ్ స్లామ్ లో 2022 యూ.ఎస్ ఓపెన్ లో ఆడింది. తన వీడ్కోలు సందర్భంగా సహకరించి మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు