ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం శుభవార్త చెప్పింది. ఉత్తరాంధ్ర వాసుల ఆకాంక్షలు నెరవేరే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిని నిర్ణయించింది. వాల్తేర్ డివిజన్ ను విశాఖ డివిజన్ పేరు మార్పు చేసి, పరిధి కూడా మార్పు చేసింది. విశాఖ డివిజన్ కిందికి 410 కిలోమీటర్ల రైల్వే సెక్షన్ లు. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఉన్నాయి. కొండపల్లి – మోటుమర్రి సెక్షన్ సికింద్రాబాద్ నుంచి విజయవాడకు మారింది. కూటమి ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఏపీకి విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ పరిధిని నిర్ణయించింది. విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను చేర్చుతూ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ను ఏర్పాటు చేసింది. గత ఐదేళ్లుగా మూలన పడి ఉన్న ప్రత్యేక రైల్వే జోన్ అంశానికి కూటమి ప్రభుత్వం ప్రాణం పోసి, కార్యరూపంలోకి తెచ్చిందని కూటమి నేతలు చెబుతున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు