భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు నాగ్ పూర్ వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటయింది. జాస్ బట్లర్ 52 (67; 4×4), జాకోబ్ బెతెల్ 51 (64; 3×4, 1×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. సాల్ట్ 43 (26; 5×4, 3×6), డకెట్ 32 (29; 6×4) పర్వలేదనిపించారు. జోఫ్రా ఆర్చర్ 21 నాటౌట్ (18; 3×4, 1×6) పరుగులు చేశాడు. భారత బౌలర్లలో హార్షిత్ రాణా 3 వికెట్లు, రవీంద్ర జడేజా 3 వికెట్లు, షమీ, అక్సర్ పటేల్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ మొదట్లోనే తడబడింది. రోహిత్ శర్మ (2), యశస్వీ జైశ్వాల్ (15) వికెట్లు కోల్పోయింది. అయితే శ్రేయాస్ అయ్యర్ 59 (36; 9×4, 2×6), అక్సర్ పటేల్ 52 (47; 6×4, 1×6) తో కలిసి శుభ్ మాన్ గిల్ 87 (96; 14×4) భారత ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. హార్థిక్ పాండ్య 9 నాటౌట్, రవీంద్ర జడేజా 12 నాటౌట్ భారత్ ను విజయ తీరాలకు చేర్చారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సాకిబ్ మహ్మద్ 2 వికెట్లు, అదిల్ రషీద్ 2 వికెట్లు, జోఫ్రా ఆర్చర్ 1 వికెట్, జాకోబ్ బెతెల్ 1 వికెట్ తీశారు. రెండో వన్డే ఈనెల 9న కటక్ వేదికగా జరుగనుంది.
Previous Articleలైలా ట్రైలర్ విడుదల..!
Next Article హైదరాబాద్- విజయవాడ మధ్య ఈవీ బస్ లు