కేవలం 99 రూపాయలతో హాయిగా హైదరాబాద్ నుండి విజయవాడ చేరుకోనే విధంగా ఈవీ (ఎలక్ట్రానిక్ వెహికల్)బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ఇది గుడ్ న్యూస్. ఈటీవో మోటార్స్‌తో కలిసి ఫ్లిక్స్ బస్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ బస్సులను నిన్న బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటీవో మోటార్స్ సీఎంవో రాజీవ్, ఫ్లిక్స్ బస్ ఇండియా ఎండీ సూర్య ఖురానా మాట్లాడారు. మూడు నాలుగు వారాల తర్వాత హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. అనంతరం విజయవాడ-విశాఖపట్నం మధ్య ఈవీ బస్సు సేవలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.
సర్వీసులు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు హైదరాబాద్ నుండి విజయవాడకు కేవలం రూ. 99తో ప్రయాణించవచ్చని వివరించారు. అన్ని ప్రభుత్వ పథకాలు ఈ బస్సుల్లో వర్తిస్తాయని, 5 గంటల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చన్నారు. ఈ బస్సుల్లో 49 మంది ప్రయాణించవచ్చని, రానున్న రోజుల్లో స్లీపర్ కోచ్ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ప్రోత్సహిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు