డెహ్రాడూన్ వేదికగా జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో బీచ్ వాలీ బాల్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగవ స్వర్ణ పతకం గెలిచిన నేపథ్యంలో క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పతకం సాధించడం అభినందనీయమని కొనియాడారు. జాతీయ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వైజాగ్ కి చెందిన క్రీడాకారులు దివ్య సాయి, మణికంఠ రాజును మంత్రి ప్రశంసించారు. క్రీడా పోటీల్లో క్రీడాకారులు మరిన్నీ పతకాల సాధించాలని ఈసందర్భంగా ఆకాంక్షించారు.
జాతీయ క్రీడల్లో ఏపీకి నాలుగో స్వర్ణం: క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం
By admin1 Min Read