ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లీగ్-2025 (డబ్ల్యూపీఎల్) లో యూపీ వారియర్స్ కు ఆల్ రౌండర్ దీప్తి శర్మ కెప్టెన్ గా వ్యవహరించనుంది. ఆస్ట్రేలియాకు చెందిన కెప్టెన్ అలీసా హీలీ గాయం కారణంగా లీగ్ కు దూరమైంది. దీంతో దీప్తి శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుంది. ఈమేరకు టీమ్ మేనేజ్మెంట్ ఆమెకు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చింది. ఇక ఈ సీజన్ కోసం గాయం కారణంగా దూరమైన హీలీ స్థానంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ లో చినెలీ హెన్రినీ జట్టులోకి తీసుకుంది. గత సీజన్ లో దీప్తి 295 పరుగులు సాధించింది. బౌలింగ్ లో 10 వికెట్లు పడగొట్టింది.
Previous Articleఆసియా మిక్స్డ్ టోర్నీకి భారత స్టార్ షట్లర్ సింధు దూరం
Next Article మిలటరీ పర్యవేక్షణలో ఛాంపియన్స్ ట్రోఫీకి భద్రత