భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు అహ్మదాబాద్ వేదికగా జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో భారత్ 142 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటయింది. శుభ్ మాన్ గిల్ 112 (102; 14×4, 3×6) సెంచరీతో చెలరేగాడు.శ్రేయాస్ అయ్యర్ 78 (64; 8×4, 2×6), విరాట్ కోహ్లీ 52 (55; 7×4, 1×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. కే.ఎల్. రాహుల్ 40 (29;3×4,1×6) పర్వాలేదనిపించాడు. దీంతో భారత్ భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్ 4 వికెట్లు, మార్క్ వుడ్ 2 వికెట్లు, సాకిబ్ మహ్మద్, జో రూట్, గస్ అట్కిన్ సన్ తలో వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 214 పరుగులకే కుప్పకూలింది. బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. టామ్ బాంటన్ (38), అట్కిన్ సన్ (38), బెన్ డకెట్ (34), జో రూట్ (24), ఫిలిప్ సాల్ట్ (23) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 2 వికెట్లు, హార్షిత్ రాణా 2 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు , హార్థిక్ పాండ్య 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
మూడో వన్డేలోనూ భారత్ గెలుపు: ఇంగ్లాండ్ పై 3-0తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్
By admin1 Min Read
Previous Articleదివంగత చమన్ అరోరాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
Next Article మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్