డోగ్రీ భాషలో ఇక్ హోర్ అశ్వథామ అనే చిన్న కథకి గాను రచయిత దివంగత చమన్ అరోరాకు సాహిత్య అకాడమీ అవార్డు 2024ను ప్రకటించారు. ఈ కథ మహాభారతంలోని అశ్వత్థామ పాత్ర గురించి చెబుతుంది. ఇక చమన్ అరోరా 1945లో జమ్మూలో జన్మించారు. జమ్మూ & కాశ్మీర్ విశ్వవిద్యాలయం నుండి వ్యవసాయంలో పట్టభద్రుడయ్యాడు. 1973 నుండి డోగ్రీ భాషలో చిన్న కథలు రాయడం ప్రారంభించారు. వివిధ చిన్న కథలు, నాటకాలు, అనువాదాలు ప్రచురించారు మరియు ఒక టెలి-ఫిల్మ్ ను తీశారు. 2008 నుండి 2013 వరకు సాహిత్య అకాడమీ డోగ్రీ సలహా బోర్డు సభ్యుడిగా ఉన్నారు. మొత్తం 24 భాషల సాహిత్యవేత్తలకు ప్రతి ఏటా సాహిత్య అకాడమీ ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది.భారతీయ సాహిత్యాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని 1954లో స్థాపించింది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

