వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ సింగిల్స్ ర్యాంకింగ్స్ లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు 15వ స్థానంలో నిలిచింది. తాజా ర్యాంకింగ్స్ లో ఆమె రెండు స్థానాలు కోల్పోయింది. గాయంతో ఇటీవల జరిగిన ఆసియా మిక్స్డ్ టీమ్ ఛాంపియన్ షిప్ లో ఆమె పాల్గొనలేదు. ఈ ప్రభావం ర్యాంకింగ్స్ పై పడింది. మరో షట్లర్ మాళవిక బాన్సోద్ మూడు స్థానాలు మెరుగై 28వ స్థానంలో నిలిచింది. మరోవైపు పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో లక్ష్యసేన్ 10వ స్థానంలో నిలిచాడు. ప్రణయ్ 31వ ర్యాంక్ పురుషుల డబుల్స్ లో సాత్విక్-చిరాగ్ 7వ ర్యాంకు, మహిళల డబుల్స్ లో గాయత్రీ గోపీచంద్-ట్రీసాజాలీ ద్వయం 9వ ర్యాంకు మిక్స్డ్ డబుల్స్ లో ధ్రువ్ కపిల-తనీష్ క్యాస్ట్రో జోడీ 30వ ర్యాంకులో నిలిచారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు