ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ శుభారంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా నేడు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటయింది. ఆరంభంలో తడబడి 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును టౌహిద్ హ్రిదయ్ 100 (118; 6×4, 2×6) జాకిర్ అలీ 68 (114; 4×4) తో కలిసి 154 పరుగుల విలువైన భాగస్వామ్యంతో గౌరవప్రదమైన స్థితిలో నిలిపారు. ఈ క్రమంలో హ్రిదయ్ సెంచరీ సాధించగా…అలీ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. టన్జిద్ హాసన్ (25), రిషద్ (18) పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో షమీ 5 వికెట్లతో సత్తా చాటడమే కాకుండా వన్డేల్లో 200 వికెట్ల క్లబ్లో చేరాడు. హార్షిత్ రాణా 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. ఇక లక్ష్య ఛేదనలో భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్ మాన్ గిల్ 101 (129; 9×4, 2×6) సెంచరీతో భారత ఇన్నింగ్స్ ను ముందుండి నడిపించాడు. బంగ్లాదేశ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. రోహిత్ శర్మ (41), కే.ఎల్.రాహుల్ (41 నాకౌట్) విరాట్ కోహ్లీ (22) పరుగులు చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025: భారత్ శుభారంభం: బంగ్లాదేశ్ పై 6 వికెట్ల తేడాతో విజయం
By admin1 Min Read