ఆసియా స్నూకర్ ఛాంపియన్ షిప్ లో భారత స్టార్ ఆటగాడు పంకజ్ అద్వానీ అదరగొట్టాడు. అతను ఈ టోర్నీలో 14వ టైటిల్ సాధించాడు. ఫైనల్ లో ఇరాన్ కు చెందిన ఆమీర్ సార్కోష్ పై 4-1తో విజయం సాధించాడు. ఆసియా ఛాంపియన్ షిప్ లో పంకజ్ అద్వానీ ఇప్పటి వరకు స్నూకర్ లో 5, బిలియర్డ్స్ లో 9 టైటిల్స్ గెలిచాడు. ఇక తాజా గెలుపుపై హార్షం వ్యక్తం చేశాడు. 14వ టైటిల్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ఈ టోర్నీలో గట్టి పోటీ ఎదురైనప్పటికీ స్వర్ణం సాధించాడు. 2006, 2010 ఆసియా క్రీడల్లో కూడా పసిడి పతకాన్ని సాధించాడు. ఇటీవలే నేషనల్ స్నూకర్ విజేతగానూ నిలిచాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు