ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో ఇండియా మాస్టర్స్ మరో విజయాన్ని సాధించింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. డారెన్ మ్యాడీ (25), టిమ్ అంబ్రోస్ (23) ఒక మోస్తరు పరుగులతో పర్వాలేదనిపించారు. ధవళ్ కులకర్ణి 3 వికెట్లు, పవన్ నేటి 2 వికెట్లు, అభిమన్యు మిథున్ 2 వికెట్లతో రాణించి ఇంగ్లాండ్ ను తక్కువ పరుగులకే కట్టడి చేశారు. అనంతరం లక్ష్యాన్ని ఇండియా 11.4 ఓవర్లలో నే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. సచిన్ టెండూల్కర్ (34), గుర్ కీరత్ (63 నాటౌట్), యువరాజ్ (27 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ లతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
Previous Articleదామోదరం సంజీవయ్య గారి పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలి..!
Next Article నేటి నుండి రంజీ ట్రోఫీ ఫైనల్..!