ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ ఫైనల్ నేటి నుండి ప్రారంభం కానుంది. కేరళ- విదర్భ 2024-25 టోర్నీ విజేతగా నిలిచేందుకు ఈ ఫైనల్ లో తలపడనున్నాయి. మొదటి సారి ఫైనల్ చేరిన కేరళ టైటిల్ కూడా గెలిచి చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. ఇక ఈ సీజన్ లో ఆడిన 9 మ్యాచ్ లలో 8 విజయాలు అందుకున్న విదర్భ ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఓటమి లేకుండా ఫైనల్ చేరింది. క్వార్టర్స్ లో తమిళనాడును, సెమీ ఫైనల్ లో ముంబైని ఓడించి మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో బలమైన జట్టుగా కనిపిస్తుంది. ఈ సీజన్ లో కేరళ కూడా స్పూర్తివంతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంది.
Previous Articleఇండియా మాస్టర్స్ కు మరో విజయం..!
Next Article సీబీఎస్ఈ ఎగ్జామ్స్ విధానంలో మార్పులు..!

