ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ ఏ నుండి ఇప్పటికే భారత్ న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్ చేరగా… తాజాగా గ్రూప్ బి నుండి ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన ఆసీస్ చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. లీగ్ లో ఒక విజయం రెండు మ్యాచ్ లో రద్దుతో మొత్తం 4 పాయింట్లతో సెమీస్ కు అర్హత సాధించింది. అంతకు ముందు సౌతాఫ్రికాతో కూడా వర్షం కారణంగా రద్దవడంతో ఇరు జట్లు పాయింట్లు పంచుకున్నాయి. ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటయింది. సెదిఖుల్లా అటల్ 85 (95; 6×4, 3×6), అజ్మతుల్లా ఒమర్ జాయ్ 67 (63; 1×4, 5×6) కీలక ఇన్నింగ్స్ తో ఆఫ్ఘనిస్తాన్ మంచి స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో డ్వార్షుయిస్ 3 వికెట్లు, ఆడమ్ జంపా 2 వికెట్లు, జాన్సన్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 12.5 ఓవర్లలలో 109-1 వద్ద మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ట్రావిస్ హెడ్ 59 నాటౌట్ (40; 9×4, 1×6), స్టీవ్ స్మిత్ (19 నాటౌట్) నిలిచారు. ఇక గ్రూప్ బి నుండి సౌతాఫ్రికా కూడా సెమీస్ చేరడం దాదాపుగా ఖరారైంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు